Padmanagar Ganesh Laddu Auction | పద్మానగర్ గణపతి లడ్డూను దక్కించుకున్న బింగి రాకేష్.. 26న భక్తులకు పంపిణీ!

గణపయ్య దివ్య ఆశీస్సులు, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతోనే ఈ పవిత్ర లడ్డూను దక్కించుకునే అదృష్టం తనకు లభించిందని ఆనందం వ్యక్తం చేశారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Padmanagar Ganesh Laddu Auction | నిజామాబాద్ నగరంలోని 24వ డివిజన్ పద్మానగర్ రోడ్ నంబర్ 4లో వేంచేసిన గణపతి మండపం వద్ద వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని లడ్డూ వేలం పాట భక్తిశ్రద్ధలతో, అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. లంబోదరుని దివ్య ప్రసాదాన్ని కైవసం చేసుకునేందుకు భక్తులు పోటీ పడగా, వేలం పాట ఎంతో ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది.

Padmanagar Ganesh Laddu Auction | నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతోనే..

ఈ పవిత్రమైన లడ్డూ వేలంలో 24వ డివిజన్ BRS పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్ బింగి రాకేష్ రూ.18,000/- (పద్దెనిమిది వేల రూపాయలు) పలికి గణపతి పవిత్ర లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా బింగి రాకేష్ మాట్లాడుతూ.. గణపయ్య దివ్య ఆశీస్సులు, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతోనే ఈ పవిత్ర లడ్డూను దక్కించుకునే అదృష్టం తనకు లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. తాను సొంతం చేసుకున్న ఈ పవిత్ర ప్రసాదాన్ని రేపు (శనివారం, 26న) కాలనీ ప్రజలకు, భక్తులందరికీ పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు.

Youtuber Home Robbery | యూట్యూబ్‌లో డబ్బుల వీడియో.. సీన్ కట్ చేస్తే రూ.1 కోటి, కిలో బంగారం మాయం!

విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు నిండాలని, డివిజన్ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండలి నిర్వాహకులు, కాలనీవాసులు, బిఆర్ఎస్ నాయకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *