అక్షరటుడే, వెబ్డెస్క్ : CDPO Caught by ACB | రాష్ట్రంలో ఏసీబీ దాడులు (ACB Raid) జరుగుతున్నా అవినీతి అధికారులు మారడం లేదు. లంచాల కోసం ప్రజలను పట్టి పీడిస్తున్నారు. చివరకు అంగన్వాడీ కేంద్రాల నుంచి సైతం లంచాలు తీసుకుంటుండటం గమనార్హం. తాజాగా ఓ సీడీపీవో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికింది.
జగిత్యాల (Jagtial) జిల్లా, మెట్పల్లి సీడీపీవో దరోజు పద్మను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. మెట్పల్లి అర్బన్ మండలం పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల తనిఖీ సమయంలో ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు ఆమె రూ.63 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.63 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సీడీపీవో పద్మను తన కార్యాలయం బయట రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
CDPO Caught by ACB | ప్రతినెలా ఇవ్వాల్సిందే..
సదరు సీడీపీవోకు ప్రతినెలా లంచం ఇవ్వాల్సిందే. లేకపోతే తనిఖీల సమయంలో ఇబ్బందులు పెడుతారు. తన పరిధిలోని మొత్తం 21 అంగన్వాడీ కేంద్రాల నుంచి నెలకు రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ మేరకు మూడు నెలలకు సంబంధించి తాజాగా రూ.63 వేల లంచం తీసుకుంటుండగా సీడీపీవో పట్టుబడ్డారు. ఆమెపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. కాగా పిల్లలు, బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ కేంద్రాల నుంచి లంచాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
దీనిని కూడా చదవండి : Indiramma Houses | రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ