అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: BJP SC Morcha | నిజామాబాద్ (Nizamabad) బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడిగా ఎడ్ల బాలకృష్ణ నియమితులయ్యారు. శనివారం జిల్లా దళిత మోర్చా కార్యవర్గాన్ని నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు పోతుల పురుషోత్తం ఉత్తర్వులు జారీ చేశారు.
BJP SC Morcha | శివాజీనగర్‌కు చెందిన..
నగరంలోని శివాజినగర్‌కు చెందిన ఎడ్ల బాలకృష్ణ గతంలో నిజామాబాద్ అర్బన్ ఎస్సీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్‌గా పని చేశారు. నిజామాబాద్ బీజేపీ పట్టణ కార్యదర్శిగా రెండుసార్లు పనిచేశారు. నగరంలోని ఖిల్లా మండలం కార్యదర్శిగానూ పని చేశారు. అలాగే ఆరు నియోజకవర్గాల పరిధికి చెందిన ఎస్సీ మోర్చా నాయకులకు జిల్లా కార్యవర్గంలో చోటు కల్పించారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా పోగుల సాయికృష్ణ, మురళీకృష్ణ, బొల్లం అరుణ్, దాయ ప్రవీణ్, ఎడ్ల బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శులుగా గుంజాల నాగభూషణ్, పులి యుగంధర్, కార్యదర్శులుగా బుడ్డ సృజన్, గొల్లపల్లి శ్రీనివాస్, అఖిలేష్ కుమార్, రాహుల్, గజ్జల శంకర్ ను నియమించారు. కోశాధికారిగా పవార్ సాయినాథ్, కార్యవర్గ సభ్యులుగా సిరికెల సతీష్, బి.సంతోష్, పల్లె మధుకర్, మల్లెపూల రాజు, సందిటి సాయిలు, అంగరి రాజలింగం, గైని శ్రీనివాస్, బాబురావు, అవినాష్, మిర్యాల శంకర్, బేగరి వినోద్, మహేంధర్లను నియమించారు. సంబంధిత నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని జిల్లా అధ్యక్షులు పురుషోత్తం తెలిపారు.
ఇది కూడా చదవండి: ఆడియన్స్ ప్రేమ దక్కింది ప్యారడైజ్ మూవీలోనే.. – నటి క్రాంతి