అక్షరటుడే, వెబ్డెస్క్ : LPU SIT Probe | లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఘటనపై పోలీసులు సిట్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు అర్ధరాత్రి చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.
యూనివర్సిటీ ఘటనపై జలంధర్ రేంజ్ డీఐజీ (DIG) నవీన్ సింగ్లా మాట్లాడారు. విద్యార్థులకు కొన్ని డిమాండ్లు ఉన్నాయన్నారు. దానిపై వర్సిటీ ప్రతినిధులతో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. హాస్టల్, ఇతర సమస్యలకు సంబంధించిన డిమాండ్లపై చర్చలు సాగుతున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సిట్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థుల ప్రతినిధులతో కలిసి దీనిపై సమగ్ర విచారణ చేపడుతామన్నారు.
LPU SIT Probe | చర్యలు తీసుకుంటాం..
LPU వైస్ ఛాన్సలర్ జస్పాల్ సింగ్ సంధు మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోపణల ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. విద్యార్థినిపై అత్యాచారం జరిగిందన్న ఘటనపై వాస్తవాలు నిర్ధారిస్తామన్నారు. వాస్తవమని తేలితే, తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థుల ఇతర డిమాండ్లను సైతం పరిష్కరిస్తామన్నారు.
LPUలో తీవ్ర ఉద్రిక్తత..విద్యార్థుల ఆందోళన, హైవే దిగ్బంధం
పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU)లో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. క్యాంపస్లో ఓ మహిళా విద్యార్థిపై బయటి వ్యక్తి అత్యాచారం చేశాడంటూ ఆరోపణలు రావడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అయితే, ఈ… pic.twitter.com/f8UI8dCKvo
— Akshara Today | Telugu News (@AksharaToday) September 27, 2026
దీనిని కూడా చదవండి : Godavari Flood | ఉగ్రరూపం దాల్చిన గోదావరి