జాతీయంDJ Sound | డీజే శబ్దం భరించలేక 140 కోళ్లు మృతి.. ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన

DJ Sound | డీజే శబ్దం భరించలేక 140 కోళ్లు మృతి.. ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన

ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లాలో పెళ్లి ఊరేగింపులో డీజే నుండి వ‌చ్చిన భారీ శ‌బ్ధం కారణంగా 140 కోళ్లు చనిపోయాయని పౌల్ట్రీ ఫామ్ యజమాని ఫిర్యాదు చేశారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: DJ Sound | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని సుల్తాన్‌పూర్ జిల్లాలో ఒక విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి ఊరేగింపులో వినిపించిన డీజే భారీ శబ్దం కారణంగా తమ ఫారంలో ఉన్న కోళ్లు మృతి చెందాయని ఓ పౌల్ట్రీ ఫామ్ యజమాని ఆరోపించడం సంచలనంగా మారింది.

బల్దిరాయ్ పోలీస్ స్టేషన్ (Baldiray Police Station) పరిధిలోని దరియాపూర్ గ్రామం (Dariyapur Village)లో సబీర్ అలీ అనే వ్యక్తి పౌల్ట్రీ ఫామ్ నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 25 రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో బబ్బన్ విశ్వకర్మ కుమార్తె వివాహ ఊరేగింపు ఆయన ఫామ్ పక్కనుండి వెళ్లింది. ఈ సందర్భంగా డీజే నుంచి వచ్చిన తీవ్ర శబ్దం వల్ల కోళ్లు భయంతో గాబరా పడ్డాయని సబీర్ అలీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

DJ Sound | డీజే శ‌బ్దంతో చ‌నిపోయిన కోళ్లు..

ఆ శబ్దాన్ని తట్టుకోలేక సుమారు 140 కోళ్లు ఒక్కసారిగా చనిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో భారీ నష్టం వాటిల్లిందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డీజే ఆపరేటర్ కవి యాదవ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బల్దిరాయ్ ఎస్‌హెచ్‌వో మహేంద్ర ప్రతాప్ సింగ్ ఈ ఘటనను ధృవీకరిస్తూ, అనుమతించిన శబ్ద పరిమితిని మించి డీజే వాడారా అనే కోణంలో విచారణ జరుగుతోందన్నారు.

DJ Sound | అవసరమైతే వెటర్నరీ నిపుణుల నివేదిక

అయితే కోళ్ల మృతికి నిజంగా డీజే శబ్దమే కారణమా, లేక మరేదైనా ఆరోగ్య సంబంధిత లేదా పర్యావరణ కారణాలున్నాయా అన్న దానిపై అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నారు. అవసరమైతే వెటర్నరీ నిపుణుల నివేదికను కూడా తీసుకుంటామని తెలిపారు.ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, శబ్ద కాలుష్యంపై మరోసారి చర్చ మొదలైంది.

ఇది కూడా చదవండి..: Modi UAE Visit | ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. యూఏఈలో కీలక భేటీ!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Trump Putin Talks | ఇరాన్‌కు రష్యా అండ.. యుద్ధం ముగింపుపై ట్రంప్ క్లారిటీ!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Trump Putin Talks | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...

Shivadhar Reddy Farewell | డీజీపీ శివధర్​రెడ్డికి ఘనంగా వీడ్కోలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Shivadhar Reddy Farewell | తెలంగాణ డీజీపీ శివధర్​రెడ్డి...

AP 10th Results | ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల

అక్షరటుడే, వెబ్​డెస్క్: AP 10th Results | ఆంధ్ర ప్రదేశ్​లో పదో...

 Rajnath Singh | ఉగ్రవాదంపై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajnath Singh | రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​...