Train Accident | రైలు ఢీకొని 100 గొర్రెలు మృతి

రైలు ఢీకొని 100కు పైగా గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటన ఘట్​కేసర్​ సమీపంలో చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Train Accident | మేడ్చల్​ – మల్కాజ్​గిరి జిల్లా ఘట్​కేసర్​లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్​పై ఉన్న గొర్రెలను రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో 100 గొర్రెలు మృతి చెందాయి.

ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలోని ఔషాపూర్‌ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున గొర్రెలను రైలు ఢీకొంది. కేపాల్‌ వద్ద రైల్వే పట్టాల సమీపంలో కాపరి గొర్రెలను మంద పెట్టి పడుకున్నాడు. అయితే తెల్లవారుజామున రైలు శబ్దానికి గొర్రెలు భయపడి పట్టాలపైకి పరుగులు తీసినట్లు సమాచారం. అదే సమయంలో కాజీపేట నుంచి హైదరాబాద్‌ (Hyderabad) నాంపల్లికి వెళ్తున్న దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ గొర్రెలను ఢీకొంది. ఈ ప్రమాదంలో 100కు పైగా గొర్రెలు చనిపోయాయి.

Train Accident | కేసు నమోదు

సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే అధికారులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతి చెందిన గొర్రెలు యాదాద్రి-భువనగిరి జిల్లా జూలూరు అలీనగర్‌కు చెందిన యజమానులవిగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనతో గొర్రెల కాపరులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రైల్వే అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. తమకు పరిహారం అందించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: NIMS Doctor DA Case | నిమ్స్​ డాక్టర్​ అక్రమాస్తుల కేసు.. బార్బర్​ ఇంట్లో రూ.7 లక్షల నగదు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *