Illegal Constructions | అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

హైదరాబాద్​ నగరంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Illegal Constructions | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైడ్రా, జీహెచ్​ఎంసీ, సైబరాబాద్​, మల్కాజ్​గిరి మున్సిపల్ కార్పొరేషన్​ అధికారులు ఆక్రమణలు తొలగిస్తున్నారు.

మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తాజాగా ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలో పలుచోట్ల కూల్చివేతలు, ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌లను చేపట్టారు. రాంపల్లి–చెర్లపల్లి రోడ్డులో అనధికారిక షెడ్డును జేసీబీ సాయంతో తొలగించారు. రాంపల్లిలో రోడ్డు ఆక్రమణలను, శ్రీనిధి కాలేజీ సమీపంలో అనుమతులు లేకుండా నిర్మించిన పెంట్​హౌస్​ను కూల్చివేశారు. యమ్నంపేటలో సైతం అనధికారికంగా నిర్మించిన పెంట్​హౌస్​ను తొలగించారు. ఈ సర్కిల్ పరిధిలో ప్రజా ప్రదేశాలను ఖాళీ చేయడం, రోడ్డు సౌలభ్యాన్ని మెరుగుపరచడం, ప్రజా భద్రతను పెంపొందించడం లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Illegal Constructions | సైబరాబాద్​లో..

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్​లో సైతం అధికారులు అక్రమ నిర్మాణాలు, ఫుట్​పాత్​ల ఆక్రమణలను తొలగిస్తున్నారు. సోమవారం 16 నిర్మాణాలను కూల్చివేశారు. మరో మూడు భవనాలకు నోటీసులు ఇచ్చారు. జీహెచ్​ఎంసీ పరిధిలో సైతం కూల్చివేతలు కొనసాగుతండటంతో అక్రమార్కులు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి..: Khairatabad Assembly Seat | ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *