అక్షరటుడే వెబ్‌డెస్క్: Classic Legends Bikes | భారతదేశంలో పండగ సీజన్‌ను పురస్కరించుకుని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ క్లాసిక్ లెజెండ్స్ తమ సరికొత్త శ్రేణి మోటార్‌సైకిళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. జావా (Jawa), యెజ్డీ (Yezdi), బీఎస్ఏ (BSA) బ్రాండ్ల నుంచి టూ-వీలర్స్‌లో కీలక అప్డేట్స్ను ప్రకటించింది. ముఖ్యంగా జావా 42 ఓజీ (Jawa 42 OG) మోడల్లో ఇప్పటివరకు ఎన్నడూ లేనివిధంగా భారీ మార్పులు చేశారు. వీటితో పాటు కొత్త రంగులు, రైడర్ల సౌకర్యానికి ప్రాధాన్యతనిస్తూ చేసిన ప్రత్యేక సవరణలతో ఈ బైకులు మార్కెట్లోకి వస్తున్నాయి. ఆయా బ్రాండ్ల అసలైన హెరిటేజ్, ప్రామాణికతను కాపాడుతూనే ఆధునిక హంగులతో వీటిని తీర్చిదిద్దారు.
Classic Legends Bikes | ప్రారంభమైన యెజ్డీ జోరు..
ఈ ఏడాది ఏప్రిల్‌లో స్క్రాంబ్లర్ లాంచ్‌తో ప్రారంభమైన యెజ్డీ జోరు.. జూలైలో వచ్చిన ‘అన్‌టెయిమ్డ్ ట్రినిటీ’ (Untamed Trinity) శ్రేణితో మరింత ఊపందుకుంది. రైడర్ల అభిరుచికి తగినట్లుగా ఇందులో అడ్వెంచర్ మోడల్ కోసం ట్యూబ్ లెస్ క్రాస్-స్పోక్ వీల్స్, కొత్త ఎల్లో ఫాల్కన్ కలర్వే, గ్రీన్ మాంబా రోడ్‌స్టర్, గ్రే పాంథర్ స్క్రాంబ్లర్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సాహసయాత్రలను ఇష్టపడే బైకర్ల కోసం ఇవి సరికొత్త అనుభూతిని పంచనున్నాయి.
Classic Legends Bikes | స్టైలిష్ లుక్..
బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత BSA బ్రాండ్ నుంచి వచ్చిన ‘స్క్రాంబ్లర్ 650’ భారత మార్కెట్లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. బ్రిటిష్ మోటార్ సైక్లింగ్ వారసత్వం, అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యంతో రూపొందిన ఈ బైక్.. అటు స్టైలిష్ లుక్‌ను ఇస్తూనే, ఇటు రోజూవారీ ప్రయాణాలకు కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది.
Classic Legends Bikes | చారిత్రాత్మక బల్లార్డ్ పియర్..
2026 సంవత్సరం జావా బ్రాండ్‌కు ఒక మైలురాయిగా నిలిచింది. ఆగస్టులో ‘ఆల్ స్టార్స్ 42 ఎఫ్‌జే’ విడుదలతో మొదలైన ఈ ప్రయాణం.. ఆనంద్ మహీంద్రా చేతుల మీదుగా లాంచ్ అయిన ‘ఆల్ స్టార్స్ 42 బాబర్’, ముంబైలోని ( Mumbai ) చారిత్రాత్మక బల్లార్డ్ పియర్‌లో ఆవిష్కరించిన ‘జావా 42 ఓజీ’ వరకు సాగింది. దిగ్గజ జావా 42లో జరిగిన ఈ అతిపెద్ద అప్డేట్ బైక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Classic Legends Bikes | కొత్త మోటార్‌సైకిల్స్..
ఈ సందర్భంగా క్లాసిక్ లెజెండ్స్ సహ-స్థాపకులు అనుపమ్ థరేజ మాట్లాడుతూ.. “జావా, యెజ్డీ, బీఎస్ఏ బ్రాండ్లలో కొత్త మోటార్‌సైకిల్స్, అప్‌గ్రేడ్స్‌తో ఈ సంవత్సరం మాకు ఎంతో ఉత్సాహవంతంగా గడిచింది. పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని తీసుకువచ్చిన ఈ మార్పులు బైకులకు మరింత స్టైలిష్ లుక్‌ను ఇస్తాయి. టెక్నాలజీ ఎంత మారుతున్నప్పటికీ.. మా బ్రాండ్ల ప్రామాణికత, వ్యక్తిత్వం, వారసత్వాన్ని మాత్రం ఎప్పుడూ మార్చలేదు” అని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: BJYM District Secretary | బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా దేవానాయక్