Traffic Constable Help | రక్తదానం చేసి చిన్నారి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్​ కానిస్టేబుల్​

Srinivas Kolluri

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Traffic Constable Help | ట్రాఫిక్​ కానిస్టేబుల్​ మానవత్వం చాటుకున్నాడు. మెడికల్​ ఎమర్జెన్సీలో ఉన్న చిన్నారికి రక్తదానం చేశాడు.

Traffic Constable Help | ఏబీ పాజిటివ్​ రక్తం..

వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని వెల్​నెస్​ హాస్పిటల్ (Wellness Hospital)​లో 19 రోజుల చిన్నారికి ఏబీ పాజిటివ్​ బ్లడ్​ అత్యవసరమైంది. అయితే డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లిన నిజామాబాద్​ ట్రాఫిక్​ (Nizamabad Traffic Police) కానిస్టేబుల్ నరేష్​కు సమాచారం అందగానే వెంటనే స్పందించాడు. ఆస్పత్రికి వచ్చి రక్తదానం చేశాడు. దీంతో అత్యవసర స్థితిలో ఉన్న చిన్నారికి రక్తదానం చేసిన నరేష్​కు​ శిశువు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (Traffic ACP Mastan Ali), ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్​ ప్రసాద్​ సైతం నరేష్​ను అభినందించారు.

ఇది కూడా చదవండి..: SR SSC Results ​| ఎస్సెస్సీ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థుల ప్రభంజనం

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *