అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pakistan Cosmetics Seized | పాకిస్థాన్ నుంచి అక్రమంగా తీసుకొచ్చి నగరం (Hyderabad)లో విక్రయిస్తున్న కాస్మొటిక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేని సామగ్రి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేపట్టారు.
నాంపల్లి (Nampally), సంతోష్ నగర్‌లోని దుకాణాలపై దాడులు చేసి సుమారు రూ.7 లక్షల విలువైన సౌందర్య సాధనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పలు బ్రాండ్‌ల క్రీములు, సబ్బులు ఉన్నాయి. ఈ ఉత్పత్తులకు భారతదేశంలోకి దిగుమతి చేసుకోవడానికి అనుమతి లేదు. అయినా కూడా నగరంలోని పలువురు వ్యాపారులు అక్రమంగా దిగుమతి చేసుకొని అమ్మకాలు సాగిస్తున్నారు. హబీబ్ నగర్‌లోని బ్యూటీ లేడీస్ ఎంపోరియం, బ్యూటీ క్వీన్ షాప్, ఎస్.జె. మెడికల్ షాపులను అధికారులు తనిఖీ చేశారు. అలాగే సంతోష్ నగర్‌లోని మదీనా కాస్మెటిక్‌లో కూడా ఇలాంటి ఉత్పత్తులనే అమ్ముతున్నట్లు గుర్తించారు.
Pakistan Cosmetics Seized | బిల్లులు లేకుండానే..
ఈ ఉత్పత్తులకు సంబంధించి సరైన కొనుగోలు బిల్లులు, ఇన్‌వాయిస్‌లు, ఇతర సహాయక పత్రాలను లేకుండానే వ్యాపారం చేస్తున్నారు. ఓ గోదాములో సరుకును నిల్వ ఉంచినట్లు గుర్తించారు. పాక్ నుంచి ముంబై మీదుగా ఇవి హైదరాబాద్‌కు వస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వీటిని ఎలా తీసుకు వచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అమ్మకంతో సంబంధం ఉన్న మహమ్మద్ ఫజల్, మహమ్మద్ అయన్, మహమ్మద్ రియాజుద్దీన్, సయ్యద్ అబిద్ అలీ, సయ్యద్ ఇస్మాయిల్ సహా పలువురి పేర్లను కూడా పోలీసులు వెల్లడించారు.
దీనిని కూడా చదవండి : Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం: షబ్బీర్ అలీ