అక్షరటుడే, పెద్దకొడప్గల్ : Farmers Power Protest | కరెంట్ కోతలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పెద్దకొడప్గల్ మండలంలోని కాటేపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను శుక్రవారం ముట్టడించారు.
Farmers Power Protest | ఇష్టారాజ్యంగా విద్యుత్ సరఫరా..!

ఒక రోజులో రెండు గంటలు కూడా విద్యుత్ సరఫరా సరిగ్గా ఉండడం లేదని రైతులు (Farmers) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లుగా కోతలు విధిస్తుండడంతో పొలాల్లో నీళ్లు పారట్లేదని వారు వాపోయారు. ఎన్నిసార్లు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించి ఫిర్యాదు చేసినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సబ్‌స్టేషన్‌ను ముట్టడించినట్లు వారు పేర్కొన్నారు. సబ్‌స్టేషన్ పరిధిలో ఒక లైన్‌మన్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు తాము సబ్‌స్టేషన్ వద్ద నుంచి కదిలేది లేదని వారు భీష్మించారు. సమాచారం అందుకున్న పోలీసులు రైతులను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Lal Bahadur Shastri | లాల్ బహదూర్ శాస్త్రి, గాంధీ ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం