అక్షరటుడే, వెబ్డెస్క్: Gandhi Bhavan | హైదరాబాద్ (Hyderabad)లోని గాంధీ భవన్ ఎదుట తెలంగాణ ఉద్యమకారులు గురువారం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ (Telangana) ఏర్పాటు కోసం ఎంతోమంది పోరాటాలు చేశారు. 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. చాలా మంది జైళ్లకు వెళ్లారు. అయితే గత బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులకు సరైన గుర్తింపు లభించలేదు. ఈ క్రమంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఉద్యమకారులకు అనేక హామీలు ఇచ్చింది. 250 గజాల స్థలం, గౌరవ వేతనం ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది.
Gandhi Bhavan | అరెస్ట్ చేసిన పోలీసులు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్న ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. దీంతో వారు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో గురువారం కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ (Gandhi Bhavan) ఎదుట నిరసన తెలిపారు. ఉద్యమకారులకు ఇచ్చిన హమీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. భిక్షాటన చేసి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు ఆందోళన చేస్తున్న ఉద్యమకారులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. దీంతో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగితే అక్రమంగా అరెస్ట్లు చేస్తున్నారని ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేదంటే రానున్న రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..: BJP President | ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం : బీజేపీ చీఫ్

