Nizamabad SIR Protest | బీజేపీకి అనుకూలంగా ‘సర్​’ ప్రక్రియ : డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి

దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూలంగానే ఎస్​ఐఆర్ ప్రక్రియ జరుగుతోందని డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి ఆరోపించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad SIR Protest | దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూలంగానే ఎస్​ఐఆర్ ప్రక్రియ జరుగుతోందని డీసీసీ(Congress Nizamabad) అధ్యక్షుడు నగేష్​ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు నగరంలోని (Nizamabad) డీసీసీ కార్యాలయంలో మాట్లాడారు.

Nizamabad SIR Protest | 7న నిరసన ర్యాలీ

నగేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ కార్యక్రమం పూర్తిగా బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉందన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని అఖిల పక్షం తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆయనను తొలగించేతవరకు ఈ వారం రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షాలతో కలిసి వివిధ రూపాలలో నిరసనలు చేస్తామని తెలిపారు. దేశ ప్రధాని మోదీ, అమిత్ షాకు ఎన్నికల కమిషనర్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

జిల్లా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం, మంగళవారం మండల కేంద్రాల్లో ధర్నా కారక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం జిల్లాకేంద్రంలో భారీ నిరసన ర్యాలీ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ ఛైర్మన్ శేఖర్ గౌడ్, సీపీఐ వనమాల కృష్ణ, ఆర్​ఎస్​పీ జిల్లా కార్యదర్శి కటారి రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్ రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సీపీఐ ఏం ఎల్ నగర కార్యదర్శి సుధాకర్, సయ్యద్ ఫిరోజ్ అలీ, రఘురామ్, పిట్ల నరేష్ పాల్గొన్నారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *