Kavitha Drought Remarks | కరువును ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలం : కవిత

కరువును ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కల్వకుంట్ల కవిత విమర్శించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kavitha Drought Remarks | రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నా.. ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్​లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు.

ప్రత్యేక కేబినెట్ మీటింగ్​ ఏర్పాటు చేసి కరువు, రైతు సమస్యలపై చర్చించాలని కవిత డిమాండ్​ చేశారు. విద్యుత్​ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్​ వరకు రైతులకు 24 గంటల విద్యుత్​ సరఫరా చేయాలన్నారు. భూగర్భ జలాలు పడిపోయాయని ఆమె పేర్కొన్నారు. ఈ ఏడాది సూపర్ ఎల్ నినో ఉంటుందని ఆరు నెలల ముందే శాస్త్రవేత్తలు చెప్పినా.. ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 6 నుంచి 7 గంటలు కూడా కరెంట్ రావడం లేదన్నారు.

Kavitha Drought Remarks | కరువు మండలాలను ప్రకటించాలి

రాష్ట్రంలోని 20 జిల్లాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయని కవిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కరువు మండలాలను ప్రకటించాలని సూచించారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలు ఇప్పటికే కరవు మండలాలను ప్రకటించాయని చెప్పారు. కరువు మండలాలను ప్రకటిస్తే కేంద్రం నుంచి మనకు సాయం అందే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. రైతులను, పంటలను ఆదుకునేందుకు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే 60 శాతం మంది రైతులు ఆగమయ్యే పరిస్థితి ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదురవుతాయని ఆమె పేర్కొన్నారు.

Kavitha Drought Remarks | బ్యాలెట్​ విధానం తేవాలి

దేశంలో ఈవీఎంలను తీసివేసి, బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కవిత కోరారు. అప్పుడే పారదర్శకంగా ఎన్నికలు జరగుతాయని చెప్పారు. అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లోనూ పేపర్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్యాలెట్​ విధానం కోసం ఢిల్లీ వరకు వెళ్లి పోరాటం చేస్తామని పేర్కొన్నారు.

దీనిని కూడా చదవండి : Leopard Movement Nizamabad | జనాల్లోకి చిరుతలు.. భయాందోళనలో ప్రజలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *