అక్షరటుడే వెబ్‌డెస్క్: India US Trade Deal | భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా తుదిరూపు సంతరించుకోలేదు. ఇరు దేశాల మధ్య పలుసార్లు చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన బిజినెస్ లీడర్స్ సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ప్రస్తుతం ఈ ట్రేడ్ చర్చలు ఒక దశలో నిలిచిపోయినట్లు కనిపిస్తున్నాయని, ఇకపై ఇరు దేశాల మధ్య రాయితీలు ఇచ్చుకోవడం దాదాపు అసాధ్యంగా మారిందని పేర్కొన్నారు.
India US Trade Deal | పీఠముడి పడింది..
ట్రేడ్ డీల్ కోసం చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఇరుపక్షాల మధ్య పీఠముడి పడినట్లు అనిపిస్తోందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పరిస్థితి చూస్తుంటే చర్చల పురోగతి ఆగిపోయినట్లు ఉందని, అయితే అందుబాటులో ఉన్న అవకాశాలను బట్టి భవిష్యత్తులో చర్చలు ముందుకు వెళ్లే అవకాశం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
India US Trade Deal | టారిఫ్‌లను ఆయుధంగా ..
భారత్‌తో ఉన్న వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు అమెరికా సంప్రదాయ చర్చల పద్ధతి కాకుండా.. టారిఫ్‌లను ఒక ఆయుధంలా వాడుతోందని ఆర్థిక మంత్రి విమర్శించారు. ఇదే సమయంలో ఈ ఏడాది ఆరంభంలో కుదిరిన భారత్-ఈయూ (EU) వాణిజ్య ఒప్పందం ఎంతో విజయవంతమైందని, దీనివల్ల మన దేశంలోని చిన్న, మధ్యతరగతి పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
India US Trade Deal | మార్కెట్లపై ప్రభావం..
భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌పై నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలతో భారత స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా ఊగిసలాటకు గురయ్యాయి. ఉదయం ఆరంభంలో ఒక దశలో భారీ లాభాలతో ట్రేడ్ అయిన సెన్సెక్స్, ఈ వ్యాఖ్యల నేపథ్యంలో గరిష్ఠ స్థాయి నుంచి సుమారు 450 పాయింట్ల వరకు పతనమైంది. ఆ తర్వాత కోలుకుని లాభాల బాటలో కొనసాగింది.
#WATCH | Speaking on US-India trade deal negotiations at the Munich Leaders Meeting, Union Finance Minister Nirmala Sitharaman says, “The agreement negotiations are still ongoing, although we’d like to believe that both the sides have reached a plateau beyond which giving or taking might be very, very difficult. But maybe if there are rooms to operate from, both sides would do it…” | https://t.co/wd5ZwMwIsS
— Economic Times (@EconomicTimes) October 5, 2026
ఇది కూడా చదవండి: Singareni Workers | సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలి : కవిత