Crime Control | నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి

నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Crime Control | నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Crime Control | ప్రతికేసులో నాణ్యమైన దర్యాప్తు

ఈ సందర్భంగా ఎస్పీ (SP Rajesh Chandra) మాట్లాడుతూ.. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లాంగ్ పెండింగ్, మిస్సింగ్ కేసుల ఛేదన, ఎన్‌బీడబ్ల్యూ ఎగ్జిక్యూషన్‌పై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. గ్రేవ్ కేసుల్లో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో సమర్థవంతమైన దర్యాప్తు చేపట్టి నిందితులకు శిక్ష పడేలా చూడాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హాట్‌స్పాట్‌లను గుర్తించి ప్రమాద సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్థిక, సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. జూదం నియంత్రణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి జూదానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని, జూదం వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని పేర్కొన్నారు.

Crime Control | దుర్గామాత నవరాత్రుల సందర్భంగా..

దుర్గా నవరాత్రుల సందర్భంగా ముందస్తు ప్రణాళికలు రూపొందించి పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ షీటీమ్స్ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నేరాల నియంత్రణలో భాగంగా ప్రతి గ్రామంలో కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటుకు చొరవ చూపాలని సూచించారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి నగదు రివార్డులు, ప్రశంసాపత్రాలతో సత్కరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, డీఎస్పీలు మధుసూదన్, శ్రీనివాసరావు, గట్టుమల్లు, విజయభాస్కర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ మురళి, జిల్లాలోని ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, రైటర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Red Cross Society | రెడ్​క్రాస్​ సొసైటీ ఛైర్మన్​గా పోతన్​కర్​ లక్ష్మీనారాయణ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *