అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Bheemgal Police Incident | భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం ఉదయం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే ఆ ఘటనలో పోలీసుల తప్పేమి లేదని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు వివరాలు వెల్లడించారు.
Bheemgal Police Incident | పెట్టి కేసు పెట్టినందువల్లే..
భీమ్‌గల్ పట్టణవాసి సుధాకర్ బస్టాండ్ సమీపంలో టీ స్టాల్ నడుపుతున్నాడు. అయితే అతడి షాప్‌కు ఎదురుగా ఉన్న కిరాణాషాప్‌లో సుధాకర్ సిగరెట్లు కొనడం లేదని.. ఆ షాప్ యజమాని ఇద్దరు విలేకరులను పంపించి ఆయనను బెదిరించారన్నారు. అలాగే సుధాకర్ టీస్టాల్ రాత్రి 10.30 తర్వాత కూడా తెరిచి ఉండడంతో పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా చూసి పెట్టికేసు పెట్టినట్లు సీపీ తెలిపారు. విలేకరులు బెదిరించిన అంశాన్ని మనసులో పెట్టుకున్న సుధాకర్ సోమవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఆవరణలో నిప్పంటించుకోవడం జరిగిందని పోలీస్ కమిషనర్ వివరించారు. ఈ విషయంలో పోలీసు వ్యవస్థకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
ఇది కూడా చదవండి: Eklavya School Kamareddy | ఏకలవ్య పాఠశాలను రాష్ట్రస్థాయిలో నంబర్‌వన్‌గా నిలపాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్