అక్షరటుడే, వెబ్‌డెస్క్ : FBO Caught by ACB | అవినీతి అధికారులు మారడం లేదు. నిత్యం ఏసీబీ దాడులు చేపడుతున్నా లంచాలు తీసుకోవడం ఆపడం లేదు. తాజాగా ఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (Forest Beat Officer) లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా గుండాల ఫారెస్ట్ రేంజ్ నదిమిగూడెం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా బానోత్ నరేష్ పని చేస్తున్నాడు. ఆయన సాయనపల్లి బీట్‌కు ఇన్ఛార్జీగా సైతం వ్యవహరిస్తున్నారు. వెంకటపురం గ్రామంలో ఓ వ్యక్తి తనకు ప్రభుత్వం గతంలో కేటాయించిన ఐదు ఎకరాల పోడు భూమి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే బీట్ ఆఫీసర్ నరేష్ అతడిని వేధించేవాడు. పోడు భూమి సాగులో జోక్యం చేసుకోకుండా ఉండేందుకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
FBO Caught by ACB | కేసు నమోదు
బీట్ ఆఫీసర్ లంచం అడగడంతో రైతు కుమారుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు గుండాలలోని తన కార్యాలయంలో బానోత్ నరేష్ గురువారం రూ.10 వేల లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు (ACB Officers) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
FBO Caught by ACB | లంచం ఇవ్వొద్దు
ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలన ఇకోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
ఇది కూడా చదవండి..: Telangana Advisors | ‘సలహాదారుల’తో ఖజానాకు భారం.. అప్పుల రాష్ట్రంలో అదనపు ఖర్చు

