అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: BJP District President Arrested | బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని జీజీహెచ్ మార్చురి వద్ద ఆందోళన చేస్తున్న ఆయనను అరెస్ట్ చేసి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
BJP District President Arrested | బాధితులకు న్యాయం చేయాల్సిందే..
భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యయత్నం చేసిన సుధాకర్ మంగళవారం ఉదయం మృతి చెందాడు. ఈ క్రమంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని దినేష్ కులాచారి డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ శ్రేణులతో కలిసి మంగళవారం ఉదయం జీజీహెచ్ మార్చురికి వచ్చారు. సుధాకర్ మృతదేహాన్ని పరిశీలంచిన అనంతరం అక్కడే ధర్నాకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్ ఘటనలో పోల సుధాకర్ మృతి చెందడంతో నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని బీజేపీ నాయకులు జీజీహెచ్ మార్చురీ వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారితో పాటు పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మృతుడికి నివాళులర్పించేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి నివాసం వద్ద కూడా పోలీసులు మోహరించి, ఆయనను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు.#anchorpavitra
#nizamabad #bhimgal #telangananews #bjp #aksharatoday— Akshara Today | Telugu News (@AksharaToday) October 6, 2026
ఇది కూడా చదవండి: Sudhakar Death | భీమ్‌గల్ ఠాణాలో ఆత్మహత్యకు యత్నించిన ఛాయ్‌వాలా మృతి