అక్షరటుడే వెబ్‌డెస్క్: Allahabad High Court | మేజరైన కుమార్తె తన ఇష్టానికి వ్యతిరేకంగా తల్లిదండ్రుల వద్దే ఉండాలని బలవంతం చేయడానికి ‘హెబియస్ కార్పస్’ పిటిషన్‌ను ఆశ్రయించలేరని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. 25 ఏళ్ల తన కుమార్తె పూజను కోర్టు ముందు హాజరుపరచాలని కోరుతూ ఆమె తల్లి కళావతి దేవి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సందీప్ జైన్ ఈ తీర్పు వెలువరించారు. తల్లిదండ్రులైనంత మాత్రాన, మేజరైన పిల్లలు ఎక్కడ ఉండాలనేదానిపై వారి ఇష్టానికి వ్యతిరేకంగా శాసించలేరని న్యాయస్థానం తేల్చిచెప్పింది.
Allahabad High Court |సంపూర్ణ స్వేచ్ఛ ..
చట్టప్రకారం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగల వయసున్న ప్రతి వయోజనుడికి రాజ్యాంగం వ్యక్తిగత స్వేచ్ఛను కల్పించిందని ధర్మాసనం పేర్కొంది. సంబంధిత యువతి మేజర్ ( Major )అయినందున తనకు నచ్చిన చోట, నచ్చిన వ్యక్తులతో జీవించే సంపూర్ణ స్వేచ్ఛ ఉందని స్పష్టం చేస్తూ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. తల్లిదండ్రులు తమ వ్యక్తిగత ఇష్టాలను మేజరైన పిల్లలపై రుద్దడానికి ఇలాంటి న్యాయపరమైన సాధనాలను ఉపయోగించరాదని కోర్టు హితవు పలికింది.
ఇది కూడా చదవండి: Rahul Gandhi Protest | ఢిల్లీలో ఉద్రిక్తత.. ధర్నాకు దిగిన రాహుల్ గాంధీ