Cooperative Society Appointments | సహకార సంఘాల్లో ‘నామినేటెడ్’​ నియామకాలు.. బాధ్యతలు స్వీకరించిన ఛైర్మన్లు

నిజామాబాద్​ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో నూతన పాలకవర్గాల నియామక ప్రక్రియ వేగం పుంజుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Cooperative Society Appointments | జిల్లాలోని (Kamareddy) ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో (PACS) నూతన పాలకవర్గాల నియామక ప్రక్రియ వేగం పుంజుకుంది. ప్రభుత్వం నామినేటెడ్ విధానంలో పాలకవర్గాలను నియమిస్తుండటంతో ఆయా సంఘాల్లో కొత్త పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరిస్తున్నాయి. తాజాగా నియమితులైన పలువురు చైర్మన్లు, డైరెక్టర్లు సోమవారం బాధ్యతలు చేపట్టారు.

Cooperative Society Appointments | నూతన పాలకవర్గాలపై..

సహకార సంఘాల ద్వారా రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాలు, ధాన్యం కొనుగోళ్లు తదితర సేవలు అందుతున్న నేపథ్యంలో నూతన పాలకవర్గాలపై రైతుల్లో ఆశలు నెలకొన్నాయి. తమ పరిధిలోని రైతులకు అందుబాటులో ఉంటూ సహకార సంఘాలను మరింత బలోపేతం చేస్తామని నూతన ఛైర్మన్లు పేర్కొంటున్నారు.

Cooperative Society Appointments | 22 సంఘాలకు పాలకవర్గాల నియామకం

కామారెడ్డి జిల్లాలో మొత్తం 55 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉండగా, ఇప్పటివరకు 22 సంఘాలకు పాలకవర్గాలను నియమించినట్లు అధికారులు వెల్లడించారు. మరో 23 సంఘాలకు పాలకవర్గాల నియామకం చేపట్టాల్సి ఉంది. ఎన్నికలు జరిగే వరకు నామినేటెడ్ పాలకవర్గాలు కొనసాగనున్నాయి. తొలిదశలో కామారెడ్డి, మాచారెడ్డి, అంతంపల్లి, రామేశ్వర్‌పల్లి, దోమకొండ, తిప్పాపూర్, ముద్దెల్లి సహకార సంఘాలకు పాలకవర్గాలను నియమించగా, తాజాగా మరో 15 సంఘాలకు ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Cooperative Society Appointments | ఎల్లారెడ్డి నియోజకవర్గంలో..

ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని పలు సహకార సంఘాలకు నూతన పాలకవర్గాలను నియమించారు. తాడ్వాయి సింగిల్ విండో ఛైర్మన్‌గా ఎండ్రియాలకు చెందిన సంతోజిగారి సుధాకర్‌రావు, దేమికలాన్ సింగిల్ విండో ఛైర్మన్‌గా కసనోల్‌కు చెందిన ఏసగు వెంకట్‌రెడ్డిని నియమించారు. ఎల్లారెడ్డి సొసైటీ ఛైర్మన్‌గా నాగం గంగారం, మత్తమాల సొసైటీ ఛైర్మన్‌గా జైపాల్‌రెడ్డిని నియమించారు. సదాశివనగర్ సింగిల్ విండో ఛైర్మన్‌గా గాదారి శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. ఆయనతో పాటు నూతన పాలకవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. సహకార సంఘాలు కేవలం రుణాలకే పరిమితం కాకుండా రైతులకు అవసరమైన వ్యవసాయ సేవలను అందించే కేంద్రాలుగా పనిచేయాల్సిన అవసరం ఉందని నూతన పాలకవర్గాలు పేర్కొంటున్నాయి. రైతులకు సకాలంలో రుణాలు, ఎరువులు, విత్తనాలు అందించడంతో పాటు ధాన్యం కొనుగోళ్ల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Cooperative Society Appointments | నామినేషన్‌పై రాజకీయ చర్చ

సహకార సంఘాల పాలకవర్గాల నియామకంతో అధికార కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తుండగా, ఈ విధానంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు ఎన్నుకోవాల్సిన సహకార సంఘాల పాలకవర్గాలను నామినేటెడ్ పద్ధతిలో నియమించడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సొసైటీలకు వెంటనే ఎన్నికలు నిర్వహించి రైతులే తమ పాలకవర్గాలను ఎన్నుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

palaka 1

567876

ఇది కూడా చదవండి: టైర్ పేలడంతో బస్సులో చెలరేగిన మంటలు.. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *