అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Rain Forecast | రాష్ట్రం (Telangana)లో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవిని తలపించేలా పగటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ఈ క్రమంలో నేడు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడు బాలాజీ తెలిపారు.
Telangana Rain Forecast | రైతుల నిరీక్షణ
ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు అంతంతమాత్రంగానే కురిశాయి. దీనికి కరెంట్ కష్టాలు తోడు అవడంతో పంటలకు నీరు అందక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో వర్షాలు పడితే పంటలకు మేలు జరుగుతుందని రైతులు అంటున్నారు. నేడు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు రంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి, నల్గొండ, నాగర్‌కర్నూల్, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, జనగాం, హన్మకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి, సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది.
ఇది కూడా చదవండి..: Nizamabad Food Safety Raids | నగరంలో ఫుడ్సేఫ్టీ అధికారుల దాడులు.. గ్లామర్ హోటల్ సీజ్