Airport Bus Ticket Prices | భారీగా తగ్గిన ఎయిర్​పోర్ట్​ బస్సు టికెట్​ ధరలు

శంషాబాద్ విమానాశ్రయానికి నడిచే 'పుష్పక్' ఏసీ బస్సుల ఛార్జీలను భారీగా తగ్గించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Airport Bus Ticket Prices | శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​కు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్​ న్యూస్​ చెప్పింది. విమానాశ్రయ బస్సు ఛార్జీలను 150 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

హైదరాబాద్‌ (Hyderabad)లోని రాజీవ్​గాంధీ విమానాశ్రయానికి నడిచే ‘పుష్పక్’ (Pushpak) ఏసీ బస్సుల ఛార్జీలను 40 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. సవరించిన ఛార్జీలు అక్టోబర్ 7 (నేటి) నుంచి అమలులోకి వస్తాయి.

Airport Bus Ticket Prices | తగ్గించిన రేట్లు..

జేబీఎస్​ నుంచి ఎయిర్​పోర్ట్​ వరకు గతంలో రూ.350 టికెట్​ ఉండగా.. తాజాగా దానిని రూ.200కు తగ్గించారు. మియాపూర్​ నుంచి విమానశ్రయం వరకు రూ.350 టికెట్​ ఉండగా రూ.200కు తగ్గించారు. గచ్చిబౌలి నుంచి టికెట్​ ధర రూ.300 నుంచి రూ.150కి, లింగంపల్లి–ఎయిర్​పోర్టు టికెట్​ రూ.300 నుంచి రూ.200కు తగ్గిస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. కొండాపూర్​ నుంచి ఎయిర్​పోర్ట్​కు రూ.300 నుంచి రూ.200కు తగ్గించారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Police Transfers | పలువురు ఇన్​స్పెక్టర్ల బదిలీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *