Attapur Bike Stunts | రీల్స్​ కోసం బైక్​తో స్టంట్స్​.. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

రీల్స్​ కోసం బైక్​తో స్టంట్స్​ చేసిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Attapur Bike Stunts | రీల్స్​ కోసం బైక్​తో స్టంట్స్​ చేసిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని అత్తాపూర్​లో పిల్లర్​ నంబర్​ 257 సమీపంలో మంగళవారం ముగ్గురు యువకులు బైక్​లతో స్టంట్లు చేశారు. ఈ వీడియో వైరల్​ కావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు.

పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోను గమనించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు యువకులు నంబర్ ప్లేట్లు లేని హోండా డియో స్కూటర్లతో రోడ్డుపై స్టంట్స్ చేశారు. అత్తాపూర్ పెట్రోల్ కార్ ఇన్‌చార్జ్ కె. ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ ముగ్గురు యువకులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులను కాచిగూడ నెహ్రూ నగర్‌కు చెందిన మహ్మద్ మొహినుద్దీన్ అలియాస్ మొహిన్‌, యాకుత్‌పురాలోని నెహ్రూ నగర్‌కు చెందిన మహమ్మద్ రిజ్వాన్, కాచిగూడలోని సీఐబీ క్వార్టర్స్‌కు చెందిన తోహిద్​గా గుర్తించారు.

Attapur Bike Stunts | బైక్​లు ఇవ్వొద్దు

మైనర్లకు, డ్రైవింగ్ లైసెన్సులు లేని వ్యక్తులకు ద్విచక్ర వాహనాలను ఇవ్వవద్దని పోలీసులు తల్లిదండ్రులకు సూచించారు. లైక్​లు, వ్యూస్​ కోసం యువకులు ప్రమాదకరంగా రీల్స్​ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల సోషల్​ మీడియా ఖాతాలపై నిఘా ఉంచాలన్నారు. ప్రమాదకర విన్యాసాలు చేస్తే వారిని హెచ్చరించాలని కోరారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజ్, సోషల్ మీడియా పర్యవేక్షణను ఉపయోగిస్తామని పోలీసులు తెలిపారు.

దీనిని కూడా చదవండి : Sandalwood Tilak | పూజల్లో గంధం ఎందుకు తప్పనిసరి?.. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక ఆంతర్యం ఇదే..!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *