అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Starlink India Services | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. భారత్‌లోని కొందరు కుబేరులు తన స్టార్‌లింక్ సేవలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడానికి స్టార్‌లింక్ సేవలు భారత్‌లో ప్రవేశ పెట్టకుండా ఆపుతున్నారని పేర్కొన్నారు.
ఎలాన్ మస్క్ భారత్ (India)లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించాలని గతంలో భావించారు. ఈ మేరకు దరఖాస్తు సైతం చేసుకున్నారు. అయితే ఆయనకు ఇంకా అనుమతి రాలేదు. ఈ క్రమంలో ఆరోపణలు చేశారు. దేశంలోని 11,256 గ్రామాల్లో ఇంకా 4G నెట్వర్క్ లేదన్నారు. అయితే కొందరు మాత్రం తమ కంపెనీ భారత్‌లోకి రాకుండా చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు ఎవరో మీరు ఊహించగలరు… ఇది భారత ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరం అని ఆయన అన్నారు. కాగా స్టార్‌లింక్‌తో టవర్ లేకున్నా.. ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ వస్తుంది.
Starlink India Services | ఖండించిన భారత్
కొందరు కుబేరులు స్టార్‌లింక్ ఉపగ్రహ సమాచార సేవలను అడ్డుకుంటున్నారని ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. స్టార్‌లింక్ వంటి ఉపగ్రహ సమాచార సేవలతో సహా అన్ని టెలికమ్యూనికేషన్ సేవల కోసం భారతదేశంలో నిష్పక్షపాతమైన, వివక్షారహితమైన ప్రాసెస్ ఉందని స్పష్టం చేసింది. కాగా భారత్లోకార్యకలాపాలు నిర్వహించడానికి స్టార్‌లింక్ లైసెన్సులను పొంది ఏడాదికి పైగా గడిచింది. కానీ దేశంలో తన సేవలను ప్రారంభించడానికి ఆ సంస్థకు ఇంకా అధికారుల నుంచి తుది ఆమోదం లభించలేదు. ఇప్పటికే స్టార్‌లింక్‌తో పాటు జియో, భారత ప్రభుత్వానికి చెందిన మరో సంస్థ లైసెన్స్‌లు పొందాయి అయితే లైసెన్స్ పొందిన సంస్థలు భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు నిరూపించాల్సి ఉంటుందని సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్పెక్ట్రమ్ కేటాయించాలని కోరవచ్చని పేర్కొంది. జీఎంపీసీఎస్ లైసెన్సులు పొందిన మూడు కంపెనీలు స్థూలంగా ఒకే నియంత్రణ దశలో ఉన్నాయని వెల్లడించింది.
ఇది కూడా చదవండి..: Rahul Priyanka FIR | కాంగ్రెస్ నేతలకు బిగ్ షాక్.. రాహుల్, ప్రియాంకలపై ఎఫ్ఐఆర్