Jukkal Congress Protest | జుక్కల్​లో కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీ అరెస్ట్​పై ఆగ్రహం

లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు కూటమి పార్లమెంటు సభ్యులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని కాంగ్రెస్​ శ్రేణులు నిరసించాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి:  Jukkal Congress Protest | లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు కూటమి పార్లమెంటు సభ్యులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని కాంగ్రెస్​ శ్రేణులు నిరసించాయి. ఈ మేరకు జుక్కల్​ చౌరస్తాలో నిరసన తెలిపారు.

Jukkal Congress Protest | ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పిలుపుతో జిల్లావ్యాప్తంగా నిరసనలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జుక్కల్ నియోజకవర్గం (Jukkal Constituency)లోని జుక్కల్ చౌరస్తా వద్ద 161 వ జాతీయ రహదారిపై ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, జిల్లా అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నల్ల చొక్కాలు ధరించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాహుల్ గాంధీకి న్యాయం చేయాలి’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు మాట్లాడుతూ.. ప్రజల తరపున ప్రశ్నించే నాయకులను అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని నాయకులు నాయకులు మండిపడ్డారు. ఓటుహక్కు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం తమ పోరాటం కొనసాగుతుందని, ఈ ఘటనకు నిరసనగా జిల్లావ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి..: 12 Hours Free Power | 12 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *