Land Resurvey Telangana | రైతుల ప్రయోజనాల కోసమే భూముల రీసర్వే: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

రైతులు, భూ యజమానులకు భవిష్యత్తులో ఎలాంటి భూ సమస్యలు రావొద్దనే ఉద్దేశంతోనే భూముల రీసర్వే చేయిస్తున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్​​: Land Resurvey Telangana | రైతులు, భూ యజమానులకు భవిష్యత్తులో ఎలాంటి భూ సమస్యలు రావొద్దనే ఉద్దేశంతోనే భూముల రీసర్వే చేయిస్తున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. సాలూర మండలం ఫతేపూర్​లో భూముల రీసర్వేను కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం అదనపు కలెక్టర్ వి.భుజంగరావుతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Land Resurvey Telangana | ఆధునికి పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ..

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, రోవర్ సహాయంతో సర్వే నిర్వహిస్తున్న తీరును కలెక్టర్​ క్షుణ్ణంగా పరిశీలించారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సగటున 30 ఎకరాల చొప్పున సర్వేను నిర్వహిస్తూ, వేగవంతంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. సర్వే సందర్భంగా క్షేత్రస్థాయిలో ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే, తమ దృష్టికి తేవాలన్నారు. సర్వే చేపట్టే ముందు సంబంధిత రైతులకు తప్పనిసరిగా ముందస్తు సమాచారం అందించి, వారి సమక్షంలో సర్వే నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. భూమి హద్దుల వివరాల నమోదులో పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

 Land Resurvey Telangana | సాలూరలో తొలివిడతగా..

సాలూర మండలంలో తొలివిడతగా మూడు గ్రామాల్లో భూముల రీసర్వే జరుగుతోందని పాలనాధికారి వెల్లడించారు. ఇప్పటికే బోధన్ రెవెన్యూ డివిజన్​లోని పోతంగల్, రెంజల్ తదితర మండలాల్లో 3వేల ఎకరాల వరకు విస్తీర్ణంలో సర్వే ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపారు. రీసర్వే వల్ల భవిష్యత్తులో సరిహద్దు సమస్యలు ఉత్పన్నం కావని, తద్వారా భూ వివాదాలకు ఆస్కారం ఉండదని, భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట బోధన్ ఆర్డీవో విజయకుమారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు శ్రీనివాస్ రావు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు ఉన్నారు.

ఇది కూడా చదవండి..: Navodaya Admissions 2027 | నవోదయ ప్రవేశాలకు వారం రోజులే గడువు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *