అంతర్జాతీయంIran Gulf Tensions | పర్షియన్ గల్ఫ్‌లో ‘ఇరాన్’ కొత్త నిబంధనలు.. అమెరికాకు ఇక నో...

Iran Gulf Tensions | పర్షియన్ గల్ఫ్‌లో ‘ఇరాన్’ కొత్త నిబంధనలు.. అమెరికాకు ఇక నో ఎంట్రీ!

పర్షియన్ గల్ఫ్ వేదికగా అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ముదురుతోంది. వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధిలో కొత్త అధ్యాయం మొదలవుతోందని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Iran Gulf Tensions | పర్షియన్ గల్ఫ్ వేదికగా అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ముదురుతోంది. వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధిలో (hormuz strait) కొత్త అధ్యాయం మొదలవుతోందని ఇరాన్(iran) సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ(Mojtaba Khamenei) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Iran Gulf Tensions | హర్మూజ్‌లో కొత్త నిబంధనలు..

పర్షియన్ గల్ఫ్(Persian Gulf) భవిష్యత్తులో అమెరికాకు చోటుండదని ఖమేనీ స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధి కోసం తాము కొత్త నిబంధనలను రూపొందిస్తున్నామని, ఇవి గల్ఫ్(Gulf) దేశాల ఆర్థికాభివృద్ధికి, శాంతికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. తమ జలాల్లోకి చొరబడే విదేశీ శక్తులకు (అమెరికా, ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి) సముద్ర గర్భంలో తప్ప మరెక్కడా స్థానం ఉండదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

Iran Gulf Tensions | క్షిపణి సామర్థ్యాలను రక్షించుకుంటాం..

ప్రాంతీయ భద్రతపై అమెరికాపై(America) ఆధారపడే దేశాలను ఖమేనీ ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలే తమను తాము కాపాడుకోలేకపోతున్నాయని, అలాంటిది ఇతర దేశాలకు అవి ఎలా రక్షణ కల్పిస్తాయని ఆయన ఎద్దేవా చేశారు. తమ అణు, క్షిపణి సామర్థ్యాలను జాతీయ సంపదగా రక్షించుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు.

అమెరికా దిగ్బంధనం..

మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసే వ్యూహాన్ని వేగవంతం చేశారు. ఇరాన్ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే సుమారు 42 నౌకలను అమెరికా బలగాలు అడ్డుకున్నాయి. ఎగుమతులు నిలిచిపోవడంతో ఇరాన్ ప్రధాన చమురు కేంద్రమైన ‘ఖర్గ్ ఐలాండ్’లో నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. టెహ్రాన్‌తో కఠినమైన అణు ఒప్పందం కుదిరే వరకు ఈ సముద్ర దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా స్పష్టం చేస్తోంది.

‘హార్ట్ ఎటాక్’ తెప్పిస్తామని..

అమెరికా చేస్తున్న ఈ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఇరాన్ కూడా సిద్ధమవుతోంది. తమ దగ్గర ఉన్న రహస్య, అత్యాధునిక ఆయుధంతో అమెరికాకు ‘హార్ట్ ఎటాక్’ తెప్పిస్తామని ఇరాన్ రక్షణ వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. దీంతో గల్ఫ్ ప్రాంతంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Gold Loans | గోల్డ్ లోన్లకు భారీ డిమాండ్.. రెండేళ్లలో ఐదు రెట్లు పెరుగుదల

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gold Loans | దేశంలో బంగారం తనఖా పెట్టి...

Amazon Summer Sale | సమ్మర్ సేల్ కు అమెజాన్ రెడీ.. మే 8 నుంచే గ్రేట్ సమ్మర్ సేల్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Amazon Summer Sale | అమెజాన్ (Amazon)...

Flipkart Sale | ఫ్లిప్‌కార్టులో ఆఫర్ల జాతర.. 9 నుంచి సాసా లేలే సేల్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Flipkart Sale | షాపింగ్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్...