Dhule Couple Deaths | తీవ్ర విషాదం.. కాళ్లకు గొలుసులతో నదిలో తేలిన నవదంపతుల మృతదేహాలు

మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో అత్యంత భయానక , విషాదకర ఘటన వెలుగు చూసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:  Dhule Couple Deaths | మహారాష్ట్రలోని  ( Maharashtra )ధూలే జిల్లాలో అత్యంత భయానక , విషాదకర ఘటన వెలుగు చూసింది. కొద్ది నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న నవదంపతులు తాపీ నదిలో శవాలై తేలడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుల కాళ్లకు ఇనుప గొలుసులతో తాళం వేసి ఉండటం ఈ ఘటనపై తీవ్రమైన అనుమానాలకు తావిస్తోంది.

Dhule Couple Deaths | ప్రేమ వివాహం..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధూలే జిల్లా సావల్దే ప్రాంతంలోని తాపీ నదిలో ఈ మృతదేహాలను స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాటిని వెలికితీశారు. ఆ మృతదేహాలను జల్గావ్ జిల్లా అమల్నేర్ తాలూకాకు చెందిన శ్యామ్ హరి పాటిల్, స్వప్న పాటిల్‌గా గుర్తించారు. వీరిద్దరూ కొన్ని నెలల కిందటే ప్రేమ వివాహం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Dhule Couple Deaths | హత్యనా లేక ఆత్మహత్యనా..

అయితే, మృతదేహాల కాళ్లకు ఇనుప గొలుసు బిగించి దానికి తాళం వేసి ఉండటంతో ఇది హత్యనా లేక ఆత్మహత్యనా అనే కోణంలో తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించిన స్థానిక పోలీసులు.. నదిలో లభించిన మృతదేహాల కాళ్లకు గొలుసులు వేసి ఉన్న మాట వాస్తవమేనని తెలిపారు. ఇది ఆత్మహత్యా లేదా పథకం ప్రకారం చేసిన హత్యనా అనే కోణంలో అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి:  Telangana Drought Situation | తెలంగాణలో వర్షాభావంపై సీఎం రేవంత్ రెడ్డి నజర్.. ఈనెల 12న మంత్రులతో ప్రత్యేక భేటీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *