Engili Pula Bathukamma | తెలంగాణలో పూల పండుగ షురూ.. మొదటి రోజుఎంగిలిపూల బతుకమ్మ.. విశిష్టత ఇదే

తెలంగాణ విశిష్ట సంస్కృతి, ప్రకృతి ప్రేమానుబంధానికి ప్రతీకగా నిలిచే పూల పండుగ బతుకమ్మ సంబురాలు అక్టోబర్ 10 వ తేదీన  వైభవంగా ప్రారంభం కానున్నాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Engili Pula Bathukamma | తెలంగాణ  ( Telangana ) విశిష్ట సంస్కృతి, ప్రకృతి ప్రేమానుబంధానికి ప్రతీకగా నిలిచే పూల పండుగ బతుకమ్మ సంబురాలు అక్టోబర్ 10 వ తేదీన  వైభవంగా ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో మొదటి రోజును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. పండుగ తొలి రోజును ‘ఎంగిలిపూల బతుకమ్మ’గా పిలుస్తారు.

Engili Pula Bathukamma  | ఎంగిలిపూల బతుకమ్మ..

ఈ వేడుకల్లో మొదటి రోజైన ఎంగిలిపూల బతుకమ్మ కోసం ముందురోజే ప్రకృతి నుంచి రకరకాల పూలను సేకరిస్తారు. అలా సేకరించిన పూలు వాడిపోకుండా నీటిలో ఉంచి, మరుసటి రోజు ఉదయమే వాటితో బతుకమ్మను అందంగా తీర్చిదిద్దుతారు. ముందురోజు తెచ్చిన పూలతో పేర్చడం వల్ల ఈ వేడుకకు ‘ఎంగిలిపూల బతుకమ్మ’ అనే పేరు వచ్చింది. గునుగు, తంగేడు, చామంతి, గులాబీ వంటి వివిధ రకాల రంగురంగుల పూలను ఉపయోగించి బతుకమ్మను అందంగా అలంకరిస్తారు. అనంతరం ఇంట్లోని మహిళలందరూ కలిసి భక్తిశ్రద్ధలతో గౌరమ్మను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Engili Pula Bathukamma  | విశిష్టత..

మొదటి రోజు బతుకమ్మకు సమర్పించే నైవేద్యానికి కూడా ప్రత్యేక విశిష్టత ఉంది. బతుకమ్మను అలంకరించిన తర్వాత అమ్మవారికి తులసి ఆకులు, నువ్వులు, నూకలు లేదా బియ్యం పిండి, బెల్లంతో తయారు చేసిన ప్రసాదాన్ని నివేదిస్తారు. ముఖ్యంగా నువ్వులు, రవ్వను బెల్లంతో కలిపి చేసే ఈ సాంప్రదాయ నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పించి, బతుకమ్మ ఆటపాటల అనంతరం అందరూ భక్తితో ప్రసాదంగా స్వీకరిస్తారు. తెలంగాణ సాంప్రదాయాన్ని చాటిచెప్పే ఈ తొలిరోజు వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొంటారు.

ఇది కూడా చదవండి:  Telangana Drought Situation | తెలంగాణలో వర్షాభావంపై సీఎం రేవంత్ రెడ్డి నజర్.. ఈనెల 12న మంత్రులతో ప్రత్యేక భేటీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *