Nizamabad Municipal Worker | బల్దియాలో విషాదం.. విధుల్లో ఉన్న మున్సిపల్ కార్మికుడు గుండెపోటుతో మృతి

విధుల్లో ఉన్న మున్సిపల్ కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు.

shashi kiran Mottala

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad Municipal Worker | విధుల్లో ఉన్న మున్సిపల్ కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు ఈ ఘటన నిజామాబాద్ (Nizamabad) నగరంలో శనివారం చోటుచేసుకుంది.

Nizamabad Municipal Worker | మొదట ఫిట్స్ రావడంతో..

నగరపాలక సంస్థలో అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికుడు భూమయ్య శనివారం డివిజన్ నెంబర్. 57లో టాటా ఏస్ లోడర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఆకస్మాత్తుగా ఆయనకు ఫిట్స్ రావడంతో కింద పడిపోయాడు. వెంటనే స్పందించిన సానిటరీ ఇన్స్పెక్టర్ జీవన్, సిబ్బంది అతడిని నగరంలోని జీజీహెచ్ కు తరలించారు. పరీక్షించిన వైద్యులు ఫిట్స్ వచ్చిన తర్వాత అతడికి గుండెపోటు రావడంతో మృతి చెందాడని ధృవీకరించారు. దీంతో మున్సిపాలిటీలో విషాదం నెలకొంది.

ఇది కూడా చదవండి..: Kakatiya Main Canal | కాకతీయ ప్రధాన కాలువకు నీటి విడుదల ప్రారంభం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *