Atukula Bathukamma Festival | రెండో రోజు అటుకుల బతుకమ్మ.. నైవేద్యం, ప్రత్యేకతలివే..!

తెలంగాణ బతుకమ్మ పండుగ రెండో రోజు వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: Atukula Bathukamma Festival | తెలంగాణ (Telangana) బతుకమ్మ పండుగ రెండో రోజు వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభం కానున్నాయి. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి రోజున జరుపుకునే ఈ రెండో రోజు వేడుకను ‘అటుకుల బతుకమ్మ’ అంటారు. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ఆరంభమైన పూల సంబురాలు, రెండో రోజుకు మరింత శోభను సంతరించుకుంటాయి.

Atukula Bathukamma Festival | రంగురంగుల పూలు

ఈ రోజున మహిళలు రంగురంగుల తంగేడు, గునుగు పూలతో అటుకుల బతుకమ్మను ఎంతో అలంకారంగా తీర్చిదిద్దుతారు. సాయంత్రం వేళ అందరూ ఒక్కచోట చేరి సంప్రదాయ పాటలతో గౌరమ్మను కొలుస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ ఆనందోత్సాహాలతో ఈ వేడుకను జరుపుకుంటారు.

నైవేద్య విశిష్టత..

ఈ పర్వదినాన అమ్మవారికి సమర్పించే నైవేద్యానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. పేరుకు తగ్గట్టుగానే ఈ రోజు గౌరమ్మకు ఎంతో ప్రీతిపాత్రమైన అటుకుల ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో నివేదించి, బతుకమ్మ ఆటల అనంతరం మహిళలంతా దీనిని ప్రసాదంగా స్వీకరిస్తారు.

ఇది కూడా చదవండి..: Narala Sudhakar Red Cross | నరాల సుధాకర్​ను సన్మానించిన దిల్​రాజు, శిరీష్​ రెడ్డి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *