అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: Vote Rights Protection | ఓటు హక్కును కాలరాసే చర్యలను వెంటనే నిలిపివేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. యూత్ కాంగ్రెస్, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ(NSUI), ఏఐపీఎస్యూ, పీడీఎస్‌యూ, ఏఐవైఎఫ్, ఆర్వైఎఫ్ ఆధ్వర్యంలో నగరంలోని(Nizamabad) ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
Vote Rights Protection | ప్రజాస్వామ్యానికి విరుద్దమైన చర్యలు
ఏఐఎస్ఎఫ్ (AISF) రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘురాం నాయక్ మాట్లాడుతూ, భారతదేశానికి ప్రజాస్వామ్యం ప్రాణవాయువు అయితే ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు వెన్నెముక లాంటిదని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరుగుతోందన్నారు. ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉన్నాయనే ఆరోపణల పేరుతో విచక్షణారహితంగా ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించడం సరైన విధానం కాదన్నారు. అంతేకాకుండా తాతలు, ముత్తాతల గుర్తింపు పత్రాలు సమర్పించాలని కోరడం సాధారణ ప్రజలను అనవసర ఇబ్బందులకు గురిచేసే చర్య అని అన్నారు.
Vote Rights Protection | రాజీనామా చేయాలి
ఈ పరిస్థితులకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ (SFI) జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్, ఏఐపీఎస్యూ (AIPSU) జిల్లా కార్యదర్శి బోడ అనిల్, ఎన్ఎస్యూఐ (NSUI) రాష్ట్ర ఉపాధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్, పీడీఎస్‌యూ (PDSU) జిల్లా అధ్యక్షుడు కర్క గణేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సుభోద్, ఏఐవైఎఫ్ (AIYF) జిల్లా కార్యదర్శి రంజిత్, ఆర్వైఎఫ్ (RYF) జిల్లా కార్యదర్శి పిట్ల నరేష్, అలాగే అనిల్, సన్నీ, గోపాల్ సింగ్ ఠాగూర్, రాజు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : ఢిల్లీలో హైడ్రామా.. పోలీసుల అదుపులో మమతా బెనర్జీ!