Kamareddy Ganja Seizure | కామారెడ్డిలో భారీఎత్తున గంజాయి పట్టివేత..

పట్టణంలోని రైల్వే స్టేషన్​లో ఎక్సైజ్ అధికారులు ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Ganja Seizure | పట్టణంలోని (Kamareddy) రైల్వే స్టేషన్​లో ఎక్సైజ్ అధికారులు ఎండు గంజాయిని (Excise Department) స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు.

Kamareddy Ganja Seizure | ఒడిశాలోని కాంకేర్​ నుంచి..

ఒడిశాలోని కాంకేర్ నుంచి సోలాపూర్ వెళ్తున్న నాగావళి ఎక్స్ ప్రెస్​లో (Nagavali Express) ఎండు గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో జిల్లా టాస్క్​ఫోర్స్ ప్రత్యేక బృందం కామారెడ్డి రైల్వే స్టేషన్​లో తనిఖీలు చేపట్టింది.  ఈ క్రమంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో సూట్​కేసుతో వెళ్తుండగా పట్టుకుని విచారించారు. అతని వద్ద 18 కిలోల ఎండు గంజాయి లభించగా..దీని విలువ సుమారు రూ.9 లక్షలుగా పోలీసులు గుర్తించారు.

గంజాయి తరలిస్తున్న వ్యక్తి మధ్యప్రదేశ్​లోని ఉజ్జయినికి చెందిన 26 ఏళ్ల వయసున్న అశోక్​గా గుర్తించినట్లు సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి తెలిపారు. జిల్లాలో గంజాయి సరఫరా కట్టడికి ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపడుతున్నాయన్నారు. ఈ సమావేశంలో డీటీఎఫ్ సీఐ శ్రీనివాసులు, కానిస్టేబుల్స్ అమృత్ రెడ్డి, రాజు, శిరీష పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ఢిల్లీలో హైడ్రామా.. పోలీసుల అదుపులో మమతా బెనర్జీ! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *