అక్షరటుడే, డిచ్పల్లి: Chandrayanpalli Road Accident | ఇందల్వాయి (Indalwai) మండలం చంద్రయాణ్ పల్లి శివారులో జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే వరుసలో రోడ్డుపై మూడు లారీలు, రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
Chandrayanpalli Road Accident | భారీగా ట్రాఫిక్ జామ్
కామారెడ్డి నుండి ఇందల్వాయి వైపు వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు, డ్రైవర్లకు చిన్నపాటి గాయాల మాత్రమే అయినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం కారణంగా నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేసి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: బతుకమ్మ స్పెషల్.. తెలంగాణ సంస్కృతికి ప్రతీక!