అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Malakpet Accident | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నవ వధువు మృతిచెందింది.
సరూర్ నగర్లో నివాసం ఉంటున్న లావణ్యకు ఆగస్టు 30న శ్రీకాంత్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఆమె శనివారం స్కూటీపై వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు బస్సు కింద పడిపోయింది. మలక్‌పేటలోని డి-మార్ట్ (D-Mart) సిగ్నల్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా స్కూటీ అదుపు తప్పి లావణ్య కింద పడిపోయింది. ఆమె బస్సు కింద పడగా.. వెనుక టైర్లు లావణ్య మీద నుంచి వెళ్లాయి. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది.
Malakpet Accident | చాదర్‌ఘాట్ ఠాణా పరిధిలో..
ఈ ప్రమాదం చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. లావణ్య మృతితో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొత్తగా పెళ్లయిన ఆమె రెండు నెలలలో మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
దీనిని కూడా చదవండి : Mahabubabad | బావిలో పడి ఇద్దరు పిల్లలతో సహా తల్లి మృతి