అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Cable Lineman Electric Shock | స్తంభం ఎక్కి కేబుల్ వైర్లను సరిచేస్తుండగా విద్యుత్‌షాక్ తగిలి లైన్‌మన్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటన నగరంలోని (Nizamabad) ముబారక్‌నగర్‌లో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది.
Cable Lineman Electric Shock | ముబారక్‌నగర్‌లో..
నగరంలోని ముబారక్‌నగర్‌లో పెద్దమ్మ ఆలయానికి వెళ్లే మార్గంలో ఓ స్తంభంపై కేబుల్ టీవీ లైన్‌మన్ కేబుల్ వైర్లు సరి చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు స్తంభంపై విద్యుత్‌వైర్లకు తగలడంతో షాక్‌కు గురై కిందపడ్డాడు. దీంతో అతడి చేతికి గాయాలయ్యాయి. రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరగడంతో పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ప్రస్తుతం క్షతగాత్రుడిని జీజీహెచ్‌కు తరలించారు.
ఇది కూడా చదవండి: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. 20 వరకు వీఐపీ దర్శనాలు రద్దు!