అక్షరటుడే, వెబ్డెస్క్ : Eagle Force | హైదరాబాద్ (Hyderabad) నగరంలో డ్రగ్స్ దందా జోరుగా సాగుతోంది. ఇతర ప్రాంతాల నుంచి గంజాయి, మాదకద్రవ్యాలను తెచ్చి నగరంలో విక్రయిస్తున్నారు. పోలీసులు, ఈగల్ ఫోర్స్, ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తున్నా.. డ్రగ్స్ దందా మాత్రం ఆగడం లేదు.
హైదరాబాద్ పోలీసులు తాజాగా గోవా (Goa) నుంచి డ్రగ్స్ రవాణా చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. నగరానికి ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎక్కువగా గంజాయి సరఫరా అవుతోంది. అలాగే గోవా, ముంబయి, బెంగళూరు వంటి నగరాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో గోవాలో ఈగల్ ఫోర్స్, పంజాగుట్ట పోలీసుల సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. గోవా-హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ కీలక సూత్రధారి కస్టోడియో ఫెర్నాండెజ్ అలియాస్ క్రిస్టీని అరెస్ట్ చేశారు. పంజాగుట్టలో పట్టుబడ్డ నిందితుడి సమాచారంతో గోవా బయటపడ్డాయి.
Eagle Force | నగదు డిపాజిట్లపై అనుమానం
మే 9న పంజగుట్ట పోలీసులు 13 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల చరస్ను స్వాధీనం చేసుకోవడంతో ఈ దర్యాప్తు ప్రారంభమైంది. అనంతరం గోవా నుంచి డ్రగ్స్ తీసుకు వస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి కీలక నిందితుడు క్రిస్టీని అరెస్ట్ చేశారు. రూ.48.4 లక్షల బ్యాంకు రుణాలు, ఏటీఎంల ద్వారా జరిగిన నగదు డిపాజిట్లపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెట్వర్క్తో 25 మందికి పైగా తెలంగాణ వాసులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. డ్రగ్స్ సరఫరాను సమన్వయం చేయడంలో ఒక నైజీరియన్ పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు.
దీనిని కూడా చదవండి : Sharannavaratri Celebrations | శరన్నవరాత్రి ఉత్సవాల విశిష్టత.. తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకల ప్రత్యేకతలివే!