అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Emergency Landing | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానంలో ప్రయాణికుడి పవర్ బ్యాంక్ నుంచి మంటలు చెలరేగాయి.
ఢిల్లీ నుంచి ఇండిగో విమానం ఆదివారం చెన్నై బయలు దేరింది. మార్గమధ్యలో ఓ ప్రయాణికుడికి చెందిన పవర్ బ్యాంక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మిగతా ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అనంతరం విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.
Emergency Landing | వీడియో వైరల్
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ప్రయాణికుడు దీనిని చిత్రీకరించాడు. ఇతర ప్రయాణికులు తమ బ్యాగులతో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నట్లు అందులో కనిపిస్తోంది. అనంతరం సిబ్బంది ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లను ఉపయోగించి మంటలను ఆర్పివేశారు. ప్రయాణికులు చెన్నైకి వెళ్లడానికి ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేశారు.వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఇండిగో ఓ ప్రకటన విడుదల చేసింది. లిథియం అయాన్ బ్యాటరీలు ఉపయోగించే పవర్ బ్యాంకులు సులువుగా పేలే అవకాశం ఉంటుంది. దీంతో పలు పవర్ బ్యాంకులను డీజీసీఏ గతంలోనే విమానాల్లో నిషేధించింది. మరికొన్ని రకాలను మాత్రం అనుమతించింది. అయితే విమాన ప్రయాణ సమాయాల్లో పవర్ బ్యాంకులు ఉపయోగించొద్దని స్పష్టం చేసింది. వాటిని లగేజీలో పెట్టుకోవడానికి అనుమతి ఉంది. అయితే తాజాగా లగేజీలో ఉన్న పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం గమనార్హం.
An IndiGo flight operating from Delhi to Chennai reportedly made an emergency landing at Rajiv Gandhi International Airport in Shamshabad after a passenger’s 𝐩𝐨𝐰𝐞𝐫 𝐛𝐚𝐧𝐤 caught fire on board. The incident involved flight 6E6115, according to the sources.
#IndiGo #ShamshabadAirport #Powerbank
— Sudhakar Udumula (@sudhakarudumula) October 11, 2026
దీనిని కూడా చదవండి : NTR Dragon Movie | సెట్స్‌లోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీ-ఎంట్రీ.. రామోజీ ఫిల్మ్ సిటీలో ‘డ్రాగన్’ కొత్త షెడ్యూల్ షురూ