అక్షరటుడే, వెబ్‌డెస్క్ : HD Fire Protect IPO | నీరు, ఫోమ్, గ్యాస్ ఆధారిత అగ్నిమాపక పరిష్కారాలతో సహా అగ్ని రక్షణ పరికరాలు మరియు వ్యవస్థల ప్రముఖ తయారీదారు, సరఫరాదారులలో ఒకటైన హెచ్డీ ఫైర్ ప్రొటెక్ట్ కంపెనీని 1997లో స్థాపించారు.
స్ప్రింక్లర్స్, అలారం వాల్వ్ లతో పాటు వాటి యాక్ససరీస్, డెల్యూజ్ వాల్వ్‌లు, ఫోమ్ పరికరాలు, అగ్నిమాపక వ్యవస్థలు, మానిటర్లు, నాజిల్స్, వాటర్ స్ప్రే నాజిల్స్, కస్టమ్ ఇంజినీర్డ్ సిస్టమ్స్ , గ్యాస్ అగ్నిమాపక వ్యవస్థలతో సహా ఎనిమిది ప్రధాన వర్గాలుగా విభజించబడిన విస్తృత శ్రేణి అగ్ని రక్షణ ఉత్పత్తులు, వ్యవస్థలను తయారు చేసి సరఫరా చేస్తుంటుంది.
HD Fire Protect IPO | 90కి పైగా దేశాలకు ఎగుమతి..
హెచ్డీ ఫైర్ ప్రొటెక్ట్ కంపెనీకి మహారాష్ట్ర (Maharashtra)లోని జల్గావ్, థానేలలో 8.50 ఎకరాల విస్తీర్ణంలో తయారీ కేంద్రాలున్నాయి. ఇది తన ఉత్పత్తులను 90కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఈ సంస్థ తన సేవలను చమురు మరియు గ్యాస్, రిఫైనింగ్ మరియు పెట్రోకెమికల్స్, విద్యుత్ మరియు ఇంధనం, హెవీ ఇంజినీరింగ్, ఏరోస్పేస్, ఫార్మాస్యూటికల్స్, డేటా సెంటర్లు, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్ తదితర రంగాలతో సహా పారిశ్రామిక, నివాస, మరియు వాణిజ్య అనువర్తనాల వంటి విస్తృత శ్రేణి పరిశ్రమలకు అందిస్తోంది.
HD Fire Protect IPO | రూ. 712.31 కోట్ల సమీకరణ కోసం..
పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ. 712.31 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఆఫర్ ఫర్ సేల్ కింద రూ. 5 ఫేస్ వ్యాల్యూ కలిగిన 2,62,84,500 షేర్లను విక్రయించడం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించనుంది. ఇష్యూ మొత్తం ఆఫర్ ఫర్ సేల్ కావడంతో ఈ ఐపీవో ద్వారా వచ్చే ఆదాయంలో ఒక్క రూపాయి కూడా కంపెనీకి రాదు.
ప్రైస్ బ్యాండ్ : కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 258 నుంచి రూ. 271 లుగా నిర్ణయించింది. ఒక లాట్‌లో 55 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,905 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
కోటా : ఈ ఐపీఓలో క్యూఐబీలకు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్ ఐఐలకు 15 శాతం వాటా కేటాయించారు.
జీఎంపీ : కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్‌లో కొంత డిమాండ్ ఉంది. ఒక్కో షేరు రూ. 77 ప్రీమియంతో ఉంది. అంటే ఐపీవో అలాట్ అయ్యే వారికి లిస్టింగ్ సమయంలో 28 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
HD Fire Protect IPO | ముఖ్యమైన తేదీలు
ఐపీవో అక్టోబర్ 13న ఓపెన్ అవుతుంది. అక్టోబర్ 15 వరకు అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 16న రాత్రి షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్ వెల్లడి కానుంది. కంపెనీ షేర్లు అక్టోబర్ 21న బీఎస్ ఈ, ఎన్ ఎస్ ఈలలో లిస్ట్ అవుతాయి.
ఇది కూడా చదవండి..: Oct 12 Market Analysis | గ్రీన్ లో గ్లోబల్ మార్కెట్లు..గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ