Bollaram Child Murder Case | బొల్లారం చిన్నారి హత్య కేసులో నిందితుడి అరెస్ట్​

సికింద్రాబాద్​ పరిధిలోని బొల్లారంలో ఇటీవల చిన్నారిని కిడ్నాప్​ చేసి హత్య చేసిన నిందితుడి అరెస్ట్​.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Bollaram Child Murder Case | సికింద్రాబాద్​ (Secunderabad) పరిధిలోని బొల్లారంలో ఇటీవల చిన్నారిని కిడ్నాప్​ చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. తనను ఉద్యోగం నుంచి తొలగించారని సెక్యూరిటీ గార్డు ఈ దారుణానికి పాల్పడిన విషయం తెలిసిందే.

బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్‌లో విల్లా ఆర్కిడ్స్​లో ఐదేళ్ల చిన్నారి అరేలియా మౌజెస్​ను సెక్యూరిటీ గార్డు కిడ్నాప్​ చేసి హత్య చేశాడు. అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించడంతో కక్షతో బాలికను కిడ్నాప్​ చేశాడు. అతడికి మరో సెక్యూరిటీ గార్డు, ఎలక్ట్రీషన్​ సహకరించారు. అయితే పోలీసులకు దొరుకుతారనే భయంతో విక్రమ్​ అనంతరం బాలికను హత్య చేసి పారిపోయాడు.

Bollaram Child Murder Case | రూ.20 లక్షల డిమాండ్​

సెక్యూరిటీ గార్డు విక్రమ్​ చిన్నారిని కిడ్నాప్​ చేసి, బాలిక తల్లిదండ్రులకు ఫోన్​ చేసి రూ.20 లక్షల డిమాండ్​ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో బాలిక మృతదేహాన్ని సంప్​లో గుర్తించారు. ఈ కేసు దర్యాప్తు కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గతంలోనే ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేశారు. తాజాగా ప్రధాన నిందితుడు విక్రమ్​ను అదుపులోకి తీసుకున్నారు. మల్కాజిగిరి సుమతి ఈ రోజు బేగంపేటలోని సీపీ క్యాంప్ కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించనున్నారు.

ఇది కూడా చదవండి..: Metro Common Pass | తగ్గనున్న మెట్రో, ఆర్టీసీ కామన్​ పాస్​ ధరలు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *