Double Bedroom Issues | ‘పనులు చేస్తామని చెప్పాను కదా.. మళ్లీ ఈ డ్రామాలేంది?’.. మున్సిపల్​ కమిషనర్​ అసహనం..

కామారెడ్డి పట్టణంలోని డబుల్​ బెడ్​రూం​ లబ్ధిదారులపై మున్సిపల్​ కమిషనర్​ పర్వతాలు అసహనం వ్యక్తం చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : Double Bedroom Issues | తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళనకు దిగిన డబుల్ బెడ్​రూమ్ వాసులపై కామారెడ్డి (Kamareddy) మున్సిపల్ కమిషనర్ పర్వతాలు అసహనం వ్యక్తం చేశారు. ‘మీ పనులు చేస్తామని చెప్పాను కదా.. మళ్లీ ఈ డ్రామాలేంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Double Bedroom Issues | కామారెడ్డి పట్టణంలోని..

కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలోని డబుల్ బెడ్ రూం (Double Bedroom) ఇళ్ల వద్ద రోడ్డు, డ్రెయినేజీ తదితర సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) రూ.2 కోట్లు మంజూరు చేశారు. అయితే నిధులు మంజూరై 8 నెలలు కావస్తున్నా పనులు ప్రారంభం కావడం లేదని ఆరోపిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట భైఠాయించారు. సుమారు గంట తర్వాత ప్రజావాణి ముగించుకుని వచ్చిన కమిషనర్ ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. టెండర్ క్యాన్సిల్ కావడంతో పనులు ఆలస్యమయ్యాయని తెలిపి, అక్కడికక్కడే షబ్బీర్ అలీకి ఫోన్ చేసి వారితో మాట్లాడించారు. మరోసారి ప్రపోజల్ పెట్టి టెండర్ వేయించి పనులు పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చి, సంబంధిత పత్రాలు చూపిస్తానని తన ఛాంబర్‌కు రావాలని సూచించారు. దీంతో కొంతమంది ఛాంబర్‌కు వెళ్లగా, ‘అక్కడే మాట్లాడాను కదా.. మళ్లీ ఎందుకొచ్చారు’ అని అనడంతో వారికి, కమిషనర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది.

Double Bedroom Issues | కమిషనర్​ తీరుపై నిరసన..

అనంతరం కార్యాలయం బయటకు వచ్చిన కమిషనర్‌ను వాసులు మరోసారి చుట్టుముట్టి నిలదీయడంతో సహనం కోల్పోయారు. ‘నాకేం పనులు లేవనుకుంటున్నారా.. మీ కోసమే ఉంటానా.. అప్పుడే చెప్పాను కదా పనులు చేస్తామని.. ఏంటి ఈ డ్రామాలు’ అంటూ అసహనం వ్యక్తం చేస్తూ కారులో వెళ్లిపోయారు. తమ సమస్యల గురించి అడగడానికి వస్తే డ్రామాలు చేస్తున్నట్లు మాట్లాడడం సరికాదని, కమిషనర్ మాట్లాడే విధానం ఇదేనా అని డబుల్ బెడ్ రూం వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: ఢిల్లీలో బీజేపీ నిరసన..రాహుల్ గాంధీపై పురందేశ్వరి ఫైర్​ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *