Bheemgal Scooter Accident | స్కూటీ అదుపుతప్పి తండ్రి మృతి.. నాలుగేళ్ల కుమారుడికి గాయాలు..

స్కూటీ అదుపుతప్పిన ఘటనలో తండ్రి మృతి చెందగా.. నాలుగేళ్ల కుమారుడికి గాయాలయ్యాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal Scooter Accident | స్కూటీ అదుపుతప్పిన ఘటనలో తండ్రి మృతి చెందగా.. నాలుగేళ్ల కుమారుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని(Bheemgal) పల్లికొండ గ్రామ శివారులో ఈనెల 10న చోటు చేసుకుంది.

Bheemgal Scooter Accident | భీమ్​గల్​ ఆస్పత్రికి..

భీమ్‌గల్ ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. చౌడా తండాకు చెందిన రామావత్‌ రవి (38) తన నాలుగేళ్ల కుమారుడు జస్వంత్‌తో కలిసి స్కూటీపై భీమ్‌గల్‌ ఆస్పత్రికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పల్లికొండ శివారులో స్కూటీ అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో రవి తల, చేతికి, కుమారుడు జస్వంత్‌ ముఖానికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో నిజామాబాద్‌లోని సన్‌రైజ్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ రవి ఈనెల 11న రాత్రి మృతి చెందాడు. మృతుడి బావ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

ఇది కూడా చదవండి: ఇండియా కూటమి ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *