Kachiguda Railway Station | కదులుతున్న రైలు ఎక్కుతూ పడిపోయిన వ్యక్తి.. కాపాడిన కానిస్టేబుల్​

రైలు ఎక్కుతూ పడిపోయిన వ్యక్తిని ఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్ కాపాడారు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kachiguda Railway Station | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో తృటిలో ప్రమాదం తప్పింది. ఓ వ్యక్తి తన కూతురితో కలిసి రైలు ఎక్కుతుండగా పట్టు తప్పి కింద పడిపోయాడు.

ఓ వ్యక్తి తన కుమార్తెతో కలిసి రైల్వే స్టేషన్​కు వచ్చాడు. అతడు విశాఖ ఎక్స్​ప్రెస్​ ఎక్కాల్సి ఉంది. అయితే రైలు కదలడం ప్రారంభించడంతో అతను తన కూతురిని ఎత్తుకొని పరిగెత్తుతూ వెళ్లి రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కాలు జారడంతో కింద పడిపోయాడు.

Kachiguda Railway Station | స్పందించిన కానిస్టేబుల్​

ఈ ఘటన సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ వ్యక్తి కిందపడటం గమనించిన ఆర్పీఎఫ్​ కానిస్టేబుల్ రీనా కుమారి వెంటనే స్పందించారు. వారిని సురక్షితంగా బయటకు లాగారు. అదే సమయంలో, లోకో పైలట్ అత్యవసర బ్రేకులు వేసి రైలును నిలిపివేయడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఈ ఘటన తర్వాత, ఆ కుటుంబం సురక్షితంగా రైలు ఎక్కింది.

ఇది కూడా చదవండి..: Hyderabad Fire Accident | హైదరాబాద్​లో భారీ అగ్ని ప్రమాదం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *