Dasara Safety Tips | దసరా నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

దసరా పండుగ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ టౌన్-1 సీఐ బి. శ్రీనివాస్ సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Dasara Safety Tips | దసరా పండుగ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ (Nizamabad) టౌన్-1 సీఐ బి. శ్రీనివాస్​ సూచించారు.  ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

Dasara Safety Tips | ఆభరణాల విషయంలో అప్రమత్తత అవసరం

పండుగ సమయంలో విలువైన బంగారు ఆభరణాలు, నగదు, ఇతర విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఐ అన్నారు. అవసరానికి మించి ఆభరణాలను ధరించి రద్దీగా ప్రాంతాలకు వెళ్లకూడదని హెచ్చరించారు. కుటుంబ సమేతంగా ఊరికి వెళ్లేటప్పుడు ఇంటి తలుపులు, కిటికీలు సక్రమంగా మూసి తాళాలు వేయాలని.. ఇంట్లో నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను ఉంచకూడదని పేర్కొన్నారు. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో వీలైతే సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

Dasara Safety Tips | వాహనాల భద్రత..

ద్విచక్ర వాహనాలు, కార్లను పార్కింగ్ చేసే సమయంలో తప్పనిసరిగా తాళాలు వేయాలన్నారు. బ్యాగులు, ఇతర విలువైన వస్తువులను వాహనాల్లో వదిలి వెళ్లకూడదని సీఐ తెలిపారు. దసరా ఉత్సవాలు, దేవాలయాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ వంటి రద్దీ ప్రాంతాల్లో పర్సులు, మొబైల్ ఫోన్లు, నగలు భద్రంగా ఉంచుకోవాలని.. దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. పండుగ వేడుకలకు పిల్లలను తీసుకెళ్లేటప్పుడు వారిని నిరంతరం గమనిస్తూ ఉండాలని.. రద్దీ ప్రాంతాల్లో పిల్లలు తప్పిపోకుండా అప్రమత్తంగా చూసుకోవాలని వివరించారు.

 

ఇది కూడా చదవండి..: Godavari Pushkaralu | పుష్కరాల పనులను గడువులోపు పూర్తి చేయాలి : కలెక్టర్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *