అక్షరటుడే, ఎల్లారెడ్డి: Forest Officers Attack | అటవీ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఎల్లారెడ్డి పోలీసులు (Yellareddy Police) వివరాలు వెల్లడించారు.
Forest Officers Attack | హాజీపూర్ అటవీప్రాంతంలో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2026 సెప్టెంబర్ 30న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు నాయకోటి శ్రీనివాస్, ప్రదీప్లు హాజీపూర్ అటవీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో హాజీపూర్ తండాకు చెందిన కొంతమంది వ్యక్తులు వారి విధులకు ఆటంకం కలిగించి, వారిపై దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై ఫిర్యాదు స్వీకరించిన ఎల్లారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న హాజీపూర్ తండాకు చెందిన సబావత్ గంగారం, సబావత్ దేవుల, సబావత్ దేవీసింగ్, సబావత్ గంగారం, సబావత్ గోవింద్ను అక్టోబర్ 13న అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు.
ఇది కూడా చదవండి..: Government Schools | ప్రభుత్వ పాఠశాలల్లో అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేయించాలి..: కలెక్టర్