అక్షరటుడే, బోధన్ : Bathukamma Celebrations | బోధన్ పట్టణంలోని ఉషోదయ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. రాష్ట్రంలో అతిపెద్ద పూల పండగ అయిన బతుకమ్మ సంబరాలను కళాశాలలో విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు.
Bathukamma Celebrations | ఆడిపాడిన విద్యార్థులు
బతుకమ్మ పండుగ నేపథ్యంలో కళాశాల విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి తీరక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడి పాడారు. ఈ సందర్భంగా ఉషోదయ విద్యాసంస్థల ఛైర్మన్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ (Telangana) సాంప్రదాయానికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్, మహిళా అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Organ Donation in Telangana | తాను మరణిస్తూ.. నలుగురికి పునర్జన్మనిచ్చాడు..