అక్షరటుడే, వెబ్డెస్క్: Nizamabad Knife Attack | నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలో వ్యక్తిగత కక్షల నేపథ్యంలో కత్తితో దాడి ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో జుబేర్ ఖాన్ (28) అనే యువకుడికి గాయాలయ్యాయి.
Nizamabad Knife Attack | తొడ భాగంలో దాడి
స్థానికంగా అందిన వివరాల ప్రకారం.. చంద్రశేఖర్ కాలనీలో నివాసముంటున్న జుబేర్ ఖాన్పై, అతని ఇంటి సమీపంలో నివసించే వసీమ్ (26) వ్యక్తిగత కక్షల కారణంగా కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో జుబేర్ ఖాన్ తొడ భాగంలో కత్తిపోటుకు గురయ్యాడు.
గాయపడిన జుబేర్ ఖాన్ను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..