అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad Car Accident | హైదరాబాద్ (Hyderabad) నగరంలో కారు బీభత్సం సృష్టించింది. కంచన్బాగ్లో, బాబా నగర్ ఫంక్షన్ హాల్ సమీపంలో అతివేగంగా వస్తున్న మహీంద్రా కారు డివైడర్ను ఢీకొట్టి కింద రోడ్డుపై పడిపోయింది.
Hyderabad Car Accident | మద్యం మత్తులో..
ప్రమాద సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం, ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ పారిపోయాడు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. డ్రైవర్ మద్యం మత్తులో కారును అతివేగంగా నడపడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కారు తీవ్రంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గురైన కారును అక్కడి నుంచి తొలగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Indiramma Houses | ఏడాదిలోపు ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి