అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Market | ఏఐ సంబంధిత స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడితో ప్రధాన ఆసియా మార్కెట్లు ఊచకోతకు గురవుతున్నాయి. కోస్పీ 8 శాతం, నిక్కీ 5 శాతం, తైవాన్ మార్కెట్ 3 శాతానికిపైగా పడిపోయాయి. చైనా మార్కెట్ సైతం సుమారు 2 శాతం నష్టంతో కదలాడుతోంది. ఆర్టిఫిషియల్ స్టాక్స్‌లో అధిక వాల్యూయేషన్లతో ఆందోళన చెందుతున్న ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు ప్రాధాన్యత ఇస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇది భారత మార్కెట్లకు సానుకూలాంశంగా మారింది.
Indian Stock Market | భారత్‌లో భిన్నంగా..
ప్రధాన ఆసియా మార్కెట్లు భారీ సెల్లాఫ్‌కు గురవుతుండగా.. భారత ఈక్విటీ మార్కెట్లోని ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీస్తున్నాయి. భారత్‌లో ఏఐ ట్రేడ్ లేకపోవడం, దేశీయ సంప్రదాయ ఐటీ సెక్టార్ రాణిస్తుండడం, వాల్యూయేషన్ సౌకర్యంతో బ్లూ చిప్స్‌లో కొనుగోళ్లతో బెంచ్‌మార్క్ సూచీలు భారీ లాభాల దిశగా సాగుతున్నాయి. అయితే మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ మాత్రం భారీగా పడిపోయాయి.
Indian Stock Market | లాభాలతో ప్రారంభం..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 184 పాయింట్ల గ్యాప్ అప్‌లో ప్రారంభమైనా మొదట్లో 69 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 1,088 పాయింట్లు పైకి ఎగబాకింది. నిఫ్టీ 49 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. మొదట్లో 34 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి 345 పాయింట్లు పెరిగింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1,226 పాయింట్ల లాభంతో 74,008 వద్ద, నిఫ్టీ 349 పాయింట్ల లాభంతో 22,972 వద్ద ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 27 స్టాక్స్ లాభాలతో, 3 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. ఎయిర్టెల్ 3.61 శాతం, టెక్ మహీంద్రా 3.60 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 3.19 శాతం, టీసీఎస్ 2.74 శాతం, రిలయన్స్ 2.69 శాతం లాభాలతో ఉన్నాయి.
Losers : ట్రెంట్ 1.33 శాతం, బీఈఎల్ 0.42 శాతం, పవర్‌గ్రిడ్ 0.16 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Bonfiglioli Transmissions IPO | ఐపీవోకు పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ..